ఓవర్సీస్ లో ఇండస్ట్రీ రికార్డ్…పవర్ స్టార్ రికార్డులు(ఊహాతీతం)

0
1255

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర జూలు విదిల్చాడు…తన సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో మరోసారి చేసి చూపిస్తున్న పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి ఓవర్సీస్ లో ఆల్ టైం రికార్డులు నమోదు చేస్తూ దూసుకు పోవడమే కాదు ఇండస్ట్రీ రికార్డు ను కూడా తిరగరాసి చరిత్ర సృష్టించింది… ఓవర్సీస్ లో ఇప్పటి వరకు ఒక్క బాహుబలి మాత్రమె ప్రీమియర్ షోలతో 1.5 మిలియన్ మార్క్ ని అందుకుంది…

ఖైదీనంబర్ 150 ఆ మార్క్ ని అందుకోవడంలో జస్ట్ మిస్ అవ్వగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా అజ్ఞాతవాసి మాత్రం 1.7 మిలియన్ డాలర్స్ కి పైగా ప్రీమియర్ షో కలెక్షన్స్ ని సాధించి చరిత్ర తిరగరాసింది.

ఇంకా రిపోర్ట్స్ రావాల్సిన లోకేషన్స్ చాలా ఉండటంతో ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది…ఈ కలెక్షన్స్ చూసి టోటల్ ఇండియా కూడా షాక్ అవుతుంది…బాలీవుడ్ మూవీస్ కి ఇలాంటి కలెక్షన్స్ కలలో కూడా సాధ్యం కాలేదు…కానీ తెలుగు సినిమా మాత్రం సంచలనాలు సృష్టిస్తూ గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సరికొత్త రికార్డుల దిశగా అడుగులు వేస్తూ దూసుకు పోతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here