అజ్ఞాతవాసి ప్రీమియర్ షో రివ్యూ…చరిత్రకెక్కనున్న పవర్ స్టార్

0
8415

          The Wait Is Over…. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక 25 వ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది… గత ఏడాది మొదటగా దసరా బరిలో నిలిచినా తర్వాత పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతి కి భీభత్సం పక్కా అనగా ఇప్పుడు ఆ భీభత్సం రేంజ్ ఎ రేంజ్ లో ఉండబోతుందో చూసి టోటల్ టాలీవుడ్ కూడా షాక్ లో ఉందనే చెప్పాలి.

రెగ్యులర్ షోలకి కొన్ని గంటల సమయం ఉన్నా ఈస్ట్ కంట్రీస్ లో సాయంత్రం 6:30 నుండే స్పెషల్ షోలతో సినిమా మొదలు అవ్వగా అక్కడ షోలు ముగిసి సినిమా టాక్ కూడా బయటికి వచ్చేసింది… అక్కడ నుండి వస్తున్న టాక్ ఎలా తెలుసుకుందాం పదండీ…

కథ గురించి ఎలాంటి క్లూ ఇక్కడ ఇవ్వడం లేదు…తర్వాత రివ్యూ లో కూడా పెర్ఫార్మెన్స్ ల గురించి మాత్రమె మాట్లాడుతాం…ఎందుకంటే ఇంత భారీ మూవీ కథ గురించి చెప్పి దాని విశ్లేషణ ఇవ్వడం సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉండటం తో ఈ నిర్ణయం తీసుకున్నాం…అందరు అర్ధం చేసుకోవాలి…

సినిమా ఎలా ఉందొ చెప్పుకోవడానికి ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలి…కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా కథ వెయిట్ ఉన్న కథ సెలెక్ట్ చేసుకుని ఆ కథ మొత్తాన్ని తన భుజాన మోసి మెప్పించాడట పవన్ కళ్యాణ్..

సినిమా స్టార్ట్ అవ్వడం కొంత స్లో గా స్టార్ట్ అయిన ఎప్పుడైతే పవర్ స్టార్ సీన్ లో ఎంటర్ అవుతాడో అప్పటి నుండి చివరి ఫ్రేం వరకు పవర్ స్టార్ తన నటనా, మ్యానరిజమ్స్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్నీ చేసి సింగిల్ హ్యాండ్ గా సినిమాను మోశాడని మెచ్చుకుంటున్నారు.

ఇక హీరోయిన్స్ కి నటన పరంగా పెద్దగా చేసి ఏమి లేదని కానీ పవన్ పక్కన నటించడంతో చాలా ఫ్రెష్ పెయిర్ గా ఇద్దరు హీరోయిన్స్ అనిపించారని అంటున్నారు…ఇద్దరిలోకి కీర్తి సురేష్ కొంత నటనతో ఆకట్టుకునే అను ఎమాన్యుయేల్ లుక్స్ తో కట్టిపడేసింది అంటున్నారు.

ఇక మిగిలిన పాత్రల్లో రావ్ రమేష్ మరియు మురళి శర్మ, రఘుబాబు కొంత వరకు నవ్వించే ప్రయత్నం చేయగా సినిమా మొత్తం పవన్ ఎంటర్ టైన్ మెంట్ ముందు అవన్నీ పెద్దగా కనిపించవు అంటున్నారు…ఇక పవన్ పాడిన “కొడకా కోటేశ్వరరావు” సాంగ్ కి ఓవర్సీస్ లో కూడా థియేటర్స్ షేక్ అయ్యాయట…

ఇక బోమన్ ఇరాని కూడా తన పాత్ర వరకు ఆకట్టుకోగా మిగిలిన పాత్రలు చేసినవారు తమ పాత్రల వరకు ఆకట్టుకున్నారు అంటున్నారు. ఇక సంగీతం విషయానికి వస్తే అనిరుద్ అందించిన సాంగ్స్ మాస్ ని అలరించేవిగా అయితే లేవు…క్లాస్ ఫీలింగ్ ని కలిగించాయి అని చెబుతూనే ఆ పని పవన్ ఒక్క సాంగ్ పాడి అంతా సెట్ చేశాడు అంటున్నారు.

ఇక త్రివిక్రమ్ దర్శకుడిగా మరోసారి ఆకట్టుకున్నా మాటల రచయితగా 100% మార్కులు దక్కించుకున్నాడు అంటున్నారు…పవన్ నుండి ఎం కోరుకుంటున్నారో అన్నీ ఇచ్చాడని అంటున్నారు. ఇక సినిమా మొదటి అర్ధభాగం కొంత స్లోగా మొదలు అయినా పవన్ ఎంట్రీ తో జోరు అందుకుంటుందని…

మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ ఉంటుందని…తర్వాత సినిమా ఆ ట్విస్టులు ఒక్కోటి విప్పుకుంటూ పవన్ చేసే ఊహాతీతమైన చర్యలతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా ఉందని అంటున్నారు…కానీ సెకెండ్ ఆఫ్ లో అక్కడక్కడా ఫోర్స్ గా పెట్టిన కామెడీ అంత పెలలేదని అంటున్నారు……

కానీ పవన్ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో గా రెచ్చిపోయి 25 వ సినిమాకి ఏవేవి ఉండాలో అన్నీ చేసి మెప్పించాడని అంటున్నారు…మొత్తం మీద సినిమాకి ఓవర్సీస్ నుండి వస్తున్న పాజిటివ్ టాక్ రెగ్యులర్ షోలకి కూడా వస్తే చరిత్ర చిరిగిపోయే రికార్డు విజయం పవర్ స్టార్ సొంతం అవ్వడం ఖాయమని చెప్పొచ్చు…చూద్దాం ఏం జరుగుతుందో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here