పవర్ స్టార్ రేంజ్ ఏంటి…ఈ న్యూస్ ఏంటి…నిర్మాతలు ఎం చేస్తున్నారు అసలు??

0
2679

  సినిమా హిట్ అయినా ఫ్లాఫ్ అయినా ఏమాత్రం క్రేజ్ విషయంలో ఇసుమంత కూడా తగ్గని హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు… సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు లాంటి ఫ్లాఫ్ మూవీస్ తో భీభత్సం సృష్టించడం పవర్ స్టార్ కే చెల్లింది… కానీ ఇప్పడు అజ్ఞాతవాసి విషయంలో పూర్తిగా సీన్ రివర్స్ అయ్యింది. ఇంతటి క్రేజ్ ఉన్న స్టార్ హీరో నటించిన సినిమాకు రెండు మూడు…ఇప్పుడు నాలుగో రోజు కూడా డెఫిసిట్ లు పడ్డాయి.

థియేటర్స్ లో జనాలు లేక అడ్వాన్స్ బుకింగ్స్ ని నిలిపి వేయడం…జనాలు రానప్పుడు షోలు కాన్సిల్ చేయడం లాంటివి పవర్ స్టార్ కెరీర్ లో పంజా తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు…ఈ వార్తలు సోషల్ మీడియా వరకు ఉంటె పర్వాలేదు కానీ…

ఏకంగా న్యూస్ పేపర్స్ ఎక్కడంతో సామాన్య ప్రేక్షకులకు సినిమా టాక్ సుస్పష్టంగా తెలిసి థియేటర్స్ లో అడుగు పెట్టేందుకు కూడా ఇష్టపడటం లేదట…ఇంత జరుగుతున్నా నిర్మాతలు సినిమాకి సంభందించిన ఎలాంటి ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టకపోవడం సినిమా రిజల్ట్ పై మరింత ప్రభావం చూపుతుంది ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పండగ హాలిడేస్ తర్వాత సినిమా ఫలితం ఏమవుతుందో అనే టెన్షన్ కూడా మొదలు అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here