టాలీవుడ్ చరిత్రలో ఏ హీరో కి రాని ఆఫర్ పవన్ కళ్యాణ్ కి వచ్చింది…ఏం చేస్తాడో మరి!!

0
7403

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ పవర్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే…సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ హిట్లకు ఫ్లాఫ్స్ కి అతీతంగా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ దూసుకు పోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అజ్ఞాతవాసి సంక్రాంతి కి అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా ఆ సినిమా తర్వాత పవన్ రాజకీయాలకే పరిమితం అవుతాడా లేక సినిమాలు చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

కానీ సినిమాలు చేస్తానని చెబుతున్నా పవన్ ఎవరి సినిమాను మొదలు పెడతాడు అనేది కూడా ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది…వేదాలం రీమేక్…తెరీ మూవీ ని పోలిన స్టొరీ తో ఒక సినిమా కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఏది ఫైనల్ కాలేదనే అంటున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ వారు పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ఏకంగా 40 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ ఇచ్చారు అనే వార్తా ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. పవర్ స్టార్ ఈ ఆఫర్ కి ఓకే అంటే టాలీవుడ్ చరిత్రలో ఇది ఆల్ టైం హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఆఫర్ అని చెప్పొచ్చు. మరి ఎం జరుగుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here