అఖిల్ (హలో) ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా—ఫట్టా

0
4427

     వివి వినాయక్ డైరెక్షన్ లో అక్కినేని అఖిల్ మొదటి సినిమా అఖిల్ గా వచ్చినా పెద్దగా ఆకట్టు కోలేదు… దాంతో కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్ అక్కినేని ఫ్యామిలీ కి మనం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రం కుమార్ డైరెక్షన్ లో హలో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. అక్కినేని నాగార్జున భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమా ఈస్ట్ కంట్రీస్ లో సాయంత్రం 6 నుండే స్పెషల్ షోలతో దూసుకు పోతుంది.

కాగా అక్కడి నుండి వస్తున్నా టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ…కథ గా చెప్పడానికి గొప్ప కథ కాకుండా స్క్రీన్ ప్లే లో విక్రం కుమార్ చేసిన మ్యాజిక్ సినిమాను నిలబెట్టింది అని అంటున్నారు. కాగా కొన్ని సీన్స్ లో విక్రం కుమార్ మార్క్ తో అల్టిమేట్ టేకింగ్ తో అలరించాడు.

అఖిల్ తొలి సినిమా తో పోల్చితే నటనలో రెండో సినిమాలో మరింత పరిణితి సాధించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో డూప్ లేకుండా చేసిన రిస్కీ ఫైట్స్ అలరించాయని చెబుతున్నారు. ఇక డాన్సుల పరంగా అఖిల్ మరోసారి తనదైన స్టైల్ లో ఆకట్టుకుని స్క్రీన్ పై దుమ్ము లేపాడు.

ఇక హీరోయిన్ కల్యాణి మొదటి సినిమా తో ఆకట్టుకుంది…లుక్స్ అండ్ యాక్టింగ్ తో ఓకే అనిపించుకుంది…ఇక మిగిలిన క్యారెక్టర్ రోల్స్ చేసిన వారందరూ తమ తమ పరిదిలో ఆకట్టుకున్నారని చెబుతున్నారు. ఇక అందరికి కన్నా ఎక్కువ మార్కులు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సొంతం చేసుకున్నాడని అంటున్నారు.

సంగీతం విషయం లో కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో కానీ ది బెస్ట్ అనిపించే అవుట్ పుట్ తో దుమ్ము లేపిన అనూప్ సినిమాకు విక్రం కుమార్ తర్వాత రెండో పిల్లర్ లా నిలిచాడు అని చెబుతుండటం విశేషం.

ఇక డైరెక్టర్ విక్రం కుమార్ తన డైరెక్షన్ తో మరోసారి ఆకట్టుకున్నాడని…సింపుల్ కథ ని తనదైన స్టైల్ లో టేకింగ్ తో ఆకట్టుకుని సినిమాను నిలబెట్టాడని అంటున్నారు. ఓవరాల్ గా అక్కడ నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న అఖిల్ హలో ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఓవరాల్ గా హిట్ కల మాత్రం కనిపిస్తుంది అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here