అఖిల్ హలో మూవీ రివ్యూ-రేటింగ్ & కామన్ ఆడియన్స్ టాక్??

0
6992

          అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన మొదటి సినిమా ఫలితం గురించి అందరికీ తెలిసిందే….దాన్ని అందరు మారిపోవాలి అని కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్ మొదటి సినిమా కి రెండో సినిమా కి సుమారు 3 ఏళ్ల సమయం తీసుకుని విక్రం కుమార్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో అక్కినేని నాగార్జున భారీ ఎత్తున నిర్మించిన హెలో సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండీ…

కథ గురించి సింపుల్ గా చెప్పుకోవాలి అంటే చిన్నప్పుడే విడిపోయిన హీరో హీరోయిన్ తిరిగి ఎలా ఎలాంటి పరిస్థితుల నడుమ ఏకం అవ్వాల్సి వచ్చింది…ఆ సమయం లో జరిగిన పరిణామాలు ఎలాంటివి అనేది సినిమా నేపధ్యం…చెప్పుకోవడానికి చాలా చాలా సింపుల్ కథ…

కానీ డైరెక్టర్ విక్రం కుమార్ సినిమాను తెరకెక్కించిన విధానం అందరి చేతా శెభాష్ అనిపించడం ఖాయం…కొన్ని సినిమాలకు కథలు రొటీన్ గానే ఉన్నా స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటాయి. కొన్ని సినిమాలు సింగిల్ లైన్ స్టొరీ తో ఉన్నా మంచి పాటలు స్క్రీన్ ప్లే ఆకట్టుకుని సినిమాను నిలబెడతాయి.

అఖిల్ హలో సినిమా రెండో కోవలోకి వచ్చే సినిమానే…చాలా సింపుల్ స్టొరీ లో కొన్ని కాంప్లికేషన్స్ ని మిక్స్ చేసి దాన్ని తెరపై అద్బుతంగా చూపించిన విక్రం కుమార్ డైరెక్టర్ గా మరోసారి ఫుల్ మార్కులు దక్కించుకున్నాడు. మొదటి ఫ్రేం నుండీ చివరి ఫ్రేం వరకు తన మార్క్ ని చూపించాడు.

హీరోగా అఖిల్ మొదటి సినిమా కన్నా రెండో సినిమాలో లుక్స్ పరంగా కానీ నటన పరంగా కానీ మరింత మెరుగు అయ్యాడు…ఇక డాన్సులు మరియు ఫైట్స్ విషయంలో దుమ్ము లేపాడు అఖిల్…యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండటం ఇక్కడ విశేషం అనే చెప్పాలి.

అఖిల్ కూడా ఆ సీన్స్ కి ఎలాంటి డూప్ లేకుండా కష్టపడి చేసి మెప్పించాడు. ఇక సింగర్ గాను సినిమాలో తన మార్క్ ని చూయించాడు. మొత్తం మీద అఖిల్ మొదటి సినిమా తో పోల్చితే 100% అవుట్ ఇచ్చాడు అఖిల్…ఇక హీరోయిన్ కళ్యాణి మొదటి సినిమానే అయినా ఆకట్టుకుంది.

లుక్స్ పరంగా అఖిల్ కి గట్టి పోటి ఇచ్చింది కళ్యాణి….ఇక జగపతిబాబు మరియు రమ్యకృష్ణ లు కూడా మంచి నటన ని కనబరిచారు….మిగిలిన నటీనటులు ఓకే అనిపించుకోగా విలన్ గా అజయ్ మరోసారి తన నటనతో ఆకట్టుకుని అఖిల్ కి మంచి పోటి ఇచ్చాడు.

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం విషయం లో కానీ బ్యాగ్రౌండ్ విషయం లోను సినిమాను మరో లెవల్ లో నిలబెట్టాడు అని చెప్పొచ్చు. నాగార్జున ప్రొడక్షన్ వాల్యూస్ అద్బుతంగా ఉన్నాయి…ఇక డైరెక్టర్ విక్రం కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే…

చిన్న కథను విక్రం కుమార్ డీల్ చేసిన విధానం తాను ఒక టాప్ క్లాస్ డైరెక్టర్ ఎలా అయ్యాడో చెప్పకనే చెబుతుంది…..ప్రతీ సీన్ ని డీటైల్ గా చూపిస్తూ కథకి ఎం కావాలో అన్నీ చేసి మెప్పించాడు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరో కోసం వచ్చిన ఆడియన్స్ కి ఫస్టాఫ్ మొత్తం మీద హీరో కి కేవలం 35 నిమిషాలకు పైగానే చూయించాడు.

కొంతవరకు ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్స్ కొంత ఓవర్ అయినట్లు అనిపించినా ఫస్ట్ టైం చూసేవారు ఎంజాయ్ చేస్తారు…సెకెండ్ ఆఫ్ కొద్దిగా స్లో అయినట్లు అనిపిస్తుంది. ఇవి తప్పితే సినిమా అంతా సేఫ్ జర్నీ ని కొనసాగించి సినిమా చూస్తున్న ఆడియన్స్ మనస్సు ని గెలిచే విధంగా ఉందని చెప్పొచ్చు.

ఓవరాల్ గా అన్నీ సాఫీగా సాగిన అఖిల్ హలో మొదటి సినిమా ఫ్లాఫ్ ని మరిపించే సినిమా…మేము సినిమాకు ఇస్తున్న రేటింగ్ 3.25/5 స్టార్స్….. ఇక బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి…మీరు సినిమా చూసి ఉంటె ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here