అఖిల్ [హలో] ట్రైలర్ రివ్యూ రేటింగ్ !!

0
452

  అఖిల్ అక్కినేని నటించిన మొదటి సినిమా అఖిల్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డ విషయం తెలిసిందే. వివివినాయక్ లాంటి టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన దర్శకుడి దర్శకత్వంలో లాంచ్ అయిన ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకోవడం లో విఫలం అవ్వగా కొంత గ్యాప్ తీసుకుని అఖిల్ ఇప్పుడు అక్కి నేని ఫ్యామిలీ మనం లాంటి మెమరబుల్ మూవీ ఇచ్చిన విక్రం కుమార్ తో సినిమా చేశాడు…

ఆ సినిమానే హలో…మంచి అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ చివర్లో రిలీజ్ కానుండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో విక్రమ్ కుమార్ మార్క్ సీన్స్ తో రఫ్ఫాడించాడు అని చెప్పొచ్చు. మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు ప్రతీ చోట విక్రం కుమార్ మార్క్ కనిపించింది.

దానికి తోడూ అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయే లెవల్ లో ఉండగా అఖిల్ స్టంట్స్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి. నటన పరంగా మొదటి సినిమా కన్నా మరింత బెటర్ అయ్యాడు అనిపించడం ఖాయం..ఓవరాల్ గా ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంటూనే విక్రమ్ కుమార్ స్టైల్ లో నే స్టొరీ ఏం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ కాన్సెప్ట్ మాత్రం అడిరిపోవడం ఖాయం అనిపిస్తుంది…మేము ట్రైలర్ కి ఇస్తున్న రేటింగ్ 3/5 స్టార్స్…మీరు చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here