అఖిల్ హలో స్టొరీ ఇదే…ఏంటి సామి ఇది!!

0
2663

  తొలి సినిమా అఖిల్ తో అనుకున్న రేంజ్ అంచనాలు అందుకోలేక పోయిన అక్కినేని అఖిల్ ఆ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ విషయంలో మాత్రం అదుర్స్ అనిపించుకున్నాడు. కానీ కంటెంట్ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం తో సినిమా బడసికొట్టింది. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ స్టొరీ టెల్లర్స్ లో ఒకరైన విక్రం కుమార్ దర్శకత్వంలో అఖిల్ చేస్తున్న అప్ కమింగ్ మూవీ హలో…

అతి త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీసర్ మరియు ట్రైలర్ లకు అద్బుతమైన రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే… కాగా రీసెంట్ గా జరిగిన మూవీ ప్రమోషనల్ ప్రెస్ మీట్ లో నిర్మాత నాగార్జున సినిమా కథ ఏంటి అనేది సింపుల్ గా రివీల్ చేసి అందరికీ ఒకింత షాక్ ఇచ్చాడు అని చెప్పొచ్చు.

నాగార్జున మాట్లాడుతూ “హీరోయిన్ నెంబర్ ఇచ్చి వెళ్ళింది.15 ఏళ్ల నుండి ఫోన్ ఎత్తదు.. ఎప్పుడు తను అంటుందని హీరో వెయిటింగ్. అదే కథ”…. అంటూ తెలియజేశాడు…. చెప్పడానికి చాలా సింపుల్ గా ఉన్న ఈ కథని విక్రం కుమార్ ఎలా డీల్ చేసి ఉంటాడు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది…మీకు ఈ స్టొరీ లైన్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here