అల్లుఅర్జున్ దువ్వాడ జగన్నాథం TRP రేటింగ్…టోటల్ ఇండస్ట్రీ షాక్

0
1305

  స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో దుమ్ము లేపే వసూళ్లు సాధించినా తర్వాత మాత్రం స్లో అవ్వడం జరిగింది. కానీ GST లాంటివి లేకపోవడం తో ఓవరాల్ గా సినిమా 70 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించగా ఇప్పుడు బుల్లితెరపై కూడా ఊహకందని టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా వీర లెవల్ లో భీభత్సం సృష్టించింది.

ఈ సినిమా టెలికాస్ట్ కి ముందు భారీ హిట్ గా నిలిచిన అల్లుఅర్జున్ సరైనోడు సినిమా బుల్లి తెరపై కేవలం 9 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. కానీ దువ్వాడ జగన్నాథం మాత్రం అలాంటిది చేయకుండా ఓ రేంజ్ టి.ఆర్.పి ని దక్కించుకుని సత్తా చాటింది.

జీతెలుగు లో టెలికాస్ట్ అయిన ఈ సినిమాకి మొత్తం మీద 21.7 టి.ఆర్.పి రేటింగ్ దక్కింది అని జీతెలుగు వర్గాలు అనౌన్స్ చేశాయి. ఇది నిజంగా నే దిమ్మతిరిగే రికార్డ్ అని చెప్పొచ్చు. ఈ రేంజ్ టి.ఆర్.పి ని ఎవ్వరూ ఊహించనూ లేదు. కానీ అల్లుఅర్జున్ హిస్టారికల్ లెవల్ లో ఈ రేంజ్ భీభత్సం సృష్టించి సంచలనం సృష్టించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here