అరవింద సమేత 2nd టైం TRP రేటింగ్…షాకింగ్

0
1134

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ ఓపెనింగ్స్ తో కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ని నమోదు చేయగా ఫైనల్ రన్ లో సినిమా ఏకంగా 98.9 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని దుమ్ము లేపింది. కాగా సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో మొదటి సారి సంక్రాంతి కానుకగా టెలికాస్ట్ అయిన విషయం అందరి కీ తెలిసిందే.

కాగా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు తీవ్ర పోటి వలన సినిమా కి అనుకున్న రేంజ్ లో TRP రేటింగ్ దక్కలేదు అనే చెప్పాలి. సినిమా కి మొత్తంగా 13.7 TRP రేటింగ్ మొదటి సారి ప్రదర్శితం అయినప్పుడు దక్కగా రీసెంట్ గా సినిమా మరోసారి…

టెలికాస్ట్ చేశారు. కాగా రెండో సారి సినిమా కి ఓవరాల్ గా 6.5 TRP రేటింగ్ వచ్చినట్లు సమాచారం. ఇదీ మరీ తక్కువ కాదు ఎక్కువ కాదు, పర్వాలేదు అనిపించే విధంగా రెండో సారి సినిమా టెలివిజన్ లో TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు.

ఎన్టీఆర్ కెరీర్ లో టెలివిజన్ లెక్కల్లో టెంపర్ 26 రేటింగ్ తో టాప్ లో ఉండగా బార్క్ రేటింగ్ లో జనతా గ్యారేజ్ 20.69 TRP రేటింగ్ తో టాప్ లో ఉంది, ఆ రికార్డు ను బ్రేక్ చేస్తుంది అనుకున్నా అరవింద సమేత బ్రేక్ చేయలేక పోయింది, కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో RRR లో చేస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు 2020 సమ్మర్ కానుకగా రాబోతున్న విషయం తెలిసిందే. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here