కన్నడలో ఇండస్ట్రీ రికార్డ్…10 కోట్ల షేర్ తో ఊచకోత

0
1764

రెండు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రం కర్నాటకలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.. గట్టిగా చెప్పాలి అంటే మిగిలిన హీరోల కన్నా కూడా వరుసగా అక్కడ ప్రతీ సినిమా కి సేఫ్ జోన్ లో గత కొంత కాలంగా కంటిన్యూ గా నిలుస్తూ వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత అక్కడ ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను మొదటి రోజు నుండే బ్రేక్ చేస్తూ ఆల్ టైమ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది.

సినిమా మూడో వీకెండ్ పూర్తి అయ్యే సమయానికి అక్కడ ఏకంగా 10 కోట్ల హిస్టారికల్ షేర్ మార్క్ ని అధిగమించి చరిత్ర సృష్టించింది. బాహుబలి సిరీస్ తప్పితే మరే సినిమా కూడా ఇక్కడ 10 కోట్ల షేర్ మార్క్ ని అందుకోలేదు.

కానీ అరవింద సమేత 2 వారాల్లో 9.85 కోట్ల షేర్ ని అందుకోగా 4 రోజుల వీకెండ్ లో 20 లక్షల షేర్ ని కలెక్ట్ చేసి టోటల్ గా 18 రోజుల్లో 10.05 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ రన్ లో 10.3 కోట్ల నుండి 10.5 కోట్ల మధ్యలో బాక్స్ ఆఫీస్ పరుగును ఆపడం ఖాయామని అంటున్నారు.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here