కన్నడ గడ్డపై 20 కోట్లు…ఏం కొట్టుడు సామి ఇది!

0
1376

బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ దసరా వీకెండ్ వరకు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సత్తా చాటగా సెలవుల తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయింది. అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పటికే సాధించాల్సిన టార్గెట్ ని అందుకుని సేఫ్ జోన్ లో చాలా ఏరియాలలో నిలిచింది ఈ సినిమా.

అందులో కర్ణాటకలో సినిమా 11 రోజులలోనే 9.75 కోట్ల షేర్ ని అందుకోగా రెండు వారాలు ముగిసే సమయనికి అక్కడ 9.85 కోట్ల షేర్ ని టోటల్ గా గ్రాస్ 20.5 కోట్ల దాకా సాధించి ఆల్ టైం రికార్డ్ ను అందుకుంది. ఈ కలెక్షన్స్ లో హైర్స్ సుమారు 2 కోట్లు ఉన్న విషయం తెలిసిందే.

దాంతో అక్కడ 20 కోట్లు అందుకుని సరికొత్త రికార్డ్ సృష్టించిన అరవింద సమేత తెలుగు సినిమాల పరంగా అక్కడ అత్యధిక షేర్ ను గ్రాస్ ని సాధించిన సినిమాగా నిలిచి సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. లిమిటెడ్ కలెక్షన్స్ తో మూడో వారం రన్ కానున్న ఈ సినిమా టోటల్ గా 10 కోట్ల మార్క్ ని అందుకునే చాన్స్ పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here