అరవింద సమేత 24 డేస్ టోటల్ కలెక్షన్స్

0
861

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 24 రోజులను పూర్తి చేసుకుంది, 23 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 98.04 కోట్ల షేర్ తో దుమ్ము లేపిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 24 వ రోజు మొత్తం మీద రెండు రాష్ట్రాలలో 8 లక్షల షేర్ ని అందుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 9.5 లక్షల దాకా షేర్ ని అందుకున్నట్లు సమాచారం.

దాంతో సినిమా మొత్తం మీద 24 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 73.28 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా 98.14 కోట్ల లోపు షేర్ ని అందుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 163.45 కోట్ల రేంజ్ లో ఉన్నట్లు సమాచారం. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ కి 8 కోట్ల రేంజ్ లో లాభం దక్కించుకోబోతుంది.

ఇక సినిమా 25 వ రోజు రెండు రాష్ట్రాలలో 24 వ రోజు కన్నా కూడా బెటర్ ఆక్యుపెన్సీ తో రన్ అవుతుంది. దాంతో ఈ రోజు వసూళ్లు రెండు రాష్ట్రాలలో మంచి జోరు అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద రోజు ముగిసే సరికి స్టేటస్ ఎలా ఉందో మరో ఆర్టికల్ లో తెలియజేస్తాం.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here