4th వీక్ 180…కాచుకోండి ఇక

0
667

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర 2300 వరకు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా సినిమా రెండో వారం లో సుమారు 570 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసింది. ఇక మూడో వారం సుమారు 380 లోపు థియేటర్స్ లో బాక్స్ ఆఫీస్ పరుగును కొనసాగించిన ఈ సినిమా ఇప్పుడు నాలుగో వారం లో అడుగు పెట్టింది.

కాగా కొత్త సినిమాలు ఉన్న నేపధ్యం లో అరవింద సమేత థియేటర్స్ బాగా తగ్గాయి. నాలుగో వారం లో అరవింద సమేత నైజాంలో 80 వరకు థియేటర్స్ లో అలాగే ఆంధ్రా మరియు సీడెడ్ లో 100 లోపు థియేటర్స్ ని హోల్డ్ చేసినట్లు సమాచారం.

దాంతో మొత్తం మీద నాలుగో వారాన్ని ఈ సినిమా 180 థియేటర్స్ లో కొనసాగించనుంది. కలెక్షన్స్ ఇప్పటికే తగ్గు ముఖం పట్టడం ఇప్పుడు థియేటర్స్ కూడా తగ్గడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ వారం కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఆసక్తి కరంగా మారింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here