కన్నడ గడ్డపై మచ్చలపులి పంజా…ఇండస్ట్రీ రికార్డ్

0
846

టాలివుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది.

సినిమా ఇప్పటికే మేజర్ ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులతో దుమ్ము లేపగా ఇప్పుడు పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసి చరిత్ర సృష్టించింది.

కర్ణాటకలో తెలుగు సినిమాల పరంగా అగ్నాతవాసి అక్కడ 5.14 కోట్ల షేర్ తో అక్కడ ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ కొట్టగా ఇప్పుడు అరవింద సమేత ఏకంగా 5.26 కోట్ల షేర్ తో సెన్సేషనల్ ఇండస్ట్రీ రికార్డ్ ను సొంతం చేసుకుంది. మిగిలిన ఏరియాల టోటల్ కలెక్షన్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here