ఫైనల్ గా 20.6 కి ఫిక్స్…కెరీర్ బెస్ట్ కొట్టాల్సిందే ఇక!

0
1015

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత రిలీజ్ కి మరి కొన్ని వారాలే సమయం ఉంది. సినిమా పై ఇప్పటికే భారీ హైప్ ఉండటం తో సినిమాను అత్యంత భారీ ఎత్తున రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక సినిమా బిజినెస్ పరంగాను దుమ్ము లేపుతున్న విషయం తెలిసిందే. ఓవర్సీస్ సీడెడ్ మరి కొన్ని ఏరియాల్లో రికార్డులు నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు నైజాం ఏరియా కి గాను ఫైనల్ బిజినెస్ కంఫామ్ అయిందనే టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది.

ఆ టాక్ ప్రకారం సినిమా నైజాం కి గాను 20.6 కోట్ల రేటు దక్కించుకుందని తెలుస్తుంది. దిల్ రాజు ఈ భారీ రేటు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సినిమా నైజాం ఏరియా లో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ అయిన జనతాగ్యారేజ్ 19.6 కోట్లకి మించి వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. మరి ఏం జరుతుందో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here