ఒక్క టికెట్ రేటు అక్షరాలా 1500/-

0
436

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కి సిధ్ధం అవుతుండగా సినిమా పై నెలకొన్న అంచనాల దృశ్యా సినిమా ను అత్యంత భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.

ఓవర్సీస్ లో సినిమా ఇప్పటికే సుమారు 250 కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ ని కంఫామ్ చేసుకోగా రిలీజ్ సమయానికి ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.. ఇక సినిమా ఓవర్సీస్ లో ఒక్కొ టికెట్ రేటు కంఫామ్ అయ్యింది.. యావరేజ్ గా సినిమా టికెట్ రేటు 20$ నుండి 22$ వరకు ఉందట.

కొన్ని లొకేషన్స్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అలాగే కొన్ని లొకేషన్స్ లో 2 ప్లస్ 1 లాంటి ఆఫర్స్ ఉండగా ఇండియన్ కరెన్సీ లో ఒక టికెట్ సుమారు 1500 వరకు ఉంటుందని సమాచారం. ఈ లెక్కన సినిమా ఓపెనింగ్స్ పరంగా అక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here