అరవింద సమేత ప్రీమియర్ షో రివ్యూ…

0
1504

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల లేటెస్ట్ మూవీ అరవింద సమేత ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున వచ్చేసింది…ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల తో రిలీజ్ అయిన ఈ సినిమా కి అక్కడ నుండి ఎలాంటి టాక్ లభిస్తుందో తెలుసుకుందాం పదండీ…

స్టొరీ లైన్ ని రివీల్ చేయకున్నా కానీ సినిమాలో హైలెట్స్ గురించి ఎక్కువగా చెబుతున్నారు వారు…మొదటి 20 నిమిషాలు త్రివిక్రమ్ మార్క్ అనుకున్నాం కానీ అది ఎన్టీఆర్ ఆది సింహాద్రి ని మరించే ఫైట్ సీన్ తో పూనకాలు తెప్పించాడు అంటున్నారు.

తర్వాత స్క్రీన్ ప్లే లవ్ యాంగిల్ లోకి మారిపోయి సరదాగా సాగుతూ ఇంటర్వెల్ లో మరో కిర్రాక్ ఫైట్ సీన్ తో ముగుస్తుందని…ఇక సెకెండ్ ఆఫ్ రాయలసీమ కి స్టొరీ మారి…ఎమోషనల్ వే లో ఎక్కువగా సాగినా కానీ ఆకట్టుకుంటుంది అంటున్నారు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

ముఖ్యంగా ఎన్టీఆర్ రావ్ రమేష్ ల మీటింగ్, ఎన్టీఆర్ నవీన్ చంద్రల వార్నింగ్ సీన్ మరికొన్ని సీన్స్ లో డైలాగ్స్ తోనే త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుందని…ఇక తమన్ అందించిన సంగీతం మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా లెవల్ ని మార్చేశాయని అంటున్నారు.

ఫ్యాన్స్ టోటల్ ఫైట్ సీన్స్ ని ఎక్స్ పెర్ట్ చేయకుండా వెళితే…వాళ్ళకి మంచి కథలో దొరకాల్సిన అన్ని రుచులు దొరుకుతాయని…అంటున్నారు..సీరియస్ స్టొరీ కాబట్టి కామెడికి త్రివిక్రమ్ పెద్దగా స్కోప్ ఇవ్వలేదని…అలాగే ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉండటం కొంత ఇబ్బంది పెట్టింది అని అంటున్నారు.

ఈ రెండు చిన్న మైనస్ లు పక్కకు పెడితే అరవింద సమేత సింపుల్ ఎన్టీఆర్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే రెండు మెట్లు ఎక్కువే అని అంటున్నారు…ఓవరాల్ గా ఓవర్సీస్ నుండి వినిపిస్తున్న టాక్ ఇది…సింపుల్ గా చెప్పాలి అంటే సినిమాకి అక్కడ మంచి టాక్ లభించింది అని చెప్పొచ్చు…ఇక రెగ్యూలర్ షోల టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here