అరవింద సమేత టోటల్ కలెక్షన్స్…సూపర్ హిట్

0
1460

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. 30 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 98.6 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా మిగిలిన రన్ లో మరికొంత కలెక్షన్స్ ని యాడ్ చేసింది. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

దసరా సెలవుల వరకు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మొదటి వారం హైర్స్ అండ్ ఓవర్ ఫ్లో కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించిన ఈ సినిమా 10 రోజుల్లోనే 90 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టి సంచలనం సృష్టించింది. కానీ తర్వాత వర్కింగ్ డేస్ లో భారీ గా స్లో డౌన్ అయిన ఈ సినిమా..

బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది. కానీ ఉన్నంతలో మళ్ళీ ప్రతీ వీకెండ్ కి ఎంతో కొంత జోరు చూపిన ఈ సినిమా టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

Nizam: 21.7Cr, Ceeded:17.64cr, UA: 8.62cr, West:4.82cr, East: 5.52cr, Guntur: 8.02cr, Krishna: 4.93cr, Nellore: 2.79cr, AP&TS Total Share: 74cr..KA 10.2cr, ROI 2.8cr, USA 8.9cr, UAE-GCC: 1.3cr, Aus-NZ: 0.8cr ROW 0.9cr, Total 24.9cr, Total worldwide Collections : 98.9cr

సినిమాను టోటల్ గా 90.4 కోట్లకు అమ్మగా సినిమా టోటల్ రన్ లో 98.9 కోట్ల షేర్ ని సాధించి 8.5 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో పాటే టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలుస్తు 164.85 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here