అరవింద సమేత టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్

0
1361

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత మొత్తం మీద భారీ ఎత్తున 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా అందులో రీసెంట్ గా ఉత్తరాంధ్రా లో వచ్చిన తుఫాన్ వలన నిర్మాతలు అక్కడ డిస్ట్రిబ్యూటర్లకి తిరిగి 70 లక్షల లోపు డబ్బు తిరిగి ఇచ్చేశారు. దాంతో టోటల్ గా ఇప్పుడు సినిమా బిజినెస్ 90.4 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.

అందులో టోటల్ ఓవర్సీస్ లో సినిమా బిజినెస్ 14 కోట్లు కాగా అమెరికాలో 10 కోట్ల బిజినెస్ గల్ఫ్ కంట్రీస్ లో 1.7 కోట్ల బిజినెస్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లో 1.3 కోట్ల బిజినెస్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 1 కోటి బిజినెస్ ని సినిమా సొంతం చేసుకుంది.

కాగా టోటల్ రన్ లో సినిమా అమెరికాలో 2.175 మిలియన్ మార్క్ ని అందుకోగా గ్రాస్ 16 కోట్లు షేర్ 8.9 కోట్లు వచ్చింది. ఇక రెస్ట్ ఆఫ్ వరల్డ్ 0.65 మిలియన్ మార్క్ షేర్ 3 కోట్లు వచ్చింది. దాంతో టోటల్ గా సినిమా ఓవర్సీస్ లో 11.9 కోట్ల షేర్ తో 2.1 కోట్ల నష్టాన్ని మిగిలించి ఎబో యావరేజ్ గా నిలిచింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here