ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిధ్ధం కండి….కొన్ని గంటల్లో…????

0
1725

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ మూవీ అరవింద సమేత కోసం అందరూ ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. కాగా ఇప్పటికే సినిమా లో ఫస్ట్ లుక్ ని అలాగే టీసర్ ని రిలీజ్ చేయాగా రెండింటికి అద్బుతమైన రెస్పాన్స్ దక్కింది.

ఇక ఇప్పుడు మరికొన్ని గంటల్లో మరో సర్ప్రైజ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సంతోష పెట్టబోతున్నారు నిర్మాతలు. వినాయక చవితి కానుకగా అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారు…ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు నిర్మాతలు.

సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకి సడెన్ సప్రైజ్ రాబోతుందని అందరూ సిధ్ధం అవ్వండి అంటూ చేసిన ట్వీట్ కి సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న అరవింద సమేత ఆడియో డైరెక్ట్ గా ఈ నెల 20 న రిలీజ్ కానుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ మొదటి వారంలో జరగనుంది. 

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here