చరిత్రకెక్కిన ఎన్టీఆర్ AP/TG లో వరుసగా 2 వ సారి సంచలన రికార్డ్

0
3829

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ భీభత్సాలు కంటిన్యు చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందు కు వచ్చిన ఎన్టీఆర్ లేటెస్ట్ జైలవకుశ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర లో టోటల్ వరల్డ్ వైడ్ గా 81.5 కోట్ల షేర్ తో ఎన్టీఆర్ కెరీర్ లోనే ఫాస్టెస్ట్ రికార్డుల ను ఎన్నో దక్కించు కుని సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ పేరిట అల్టిమేట్ రికార్డ్ వచ్చేలా చేసింది ఈ సినిమా.

కాగా జనతాగ్యారేజ్ తో మొదటి సారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 61 కోట్ల మార్క్ ని అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు జైలవకుశ సినిమాతో రెండోసారి ఈ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు. ఇలా వరుసగా రెండు సార్లు అందుకున్న రెండో హీరో అయ్యాడు.

మొదటి సారిగా అల్లుఅర్జున్ సరైనోడు మరియు దువ్వాడ జగన్నాథం సినిమాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 50 కోట్ల మార్క్ ని అందుకోగా ఇప్పుడు ఎన్టీఆర్  ఏకంగా రెండు 60 కోట్ల సినిమాలతో ఆల్ టైం బిగ్గెస్ట్ సంచలనం సృష్టించాడు. కాగా జైలవకుశ రెండు తెలుగు రాష్ట్రాల్లో 67 కోట్ల మార్క్ అందుకుంటే బ్రేక్ ఈవెన్ కానుంది. కాని 61 కోట్ల మార్క్ ని మాత్రమె అందుకుని 6 కోట్ల నష్టాన్ని దక్కించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here