కాలర్ ఎగరేసి మీసం తిప్పే న్యూస్…ఎన్టీఆర్ ఎం కొట్టాడు సామి!!

0
3530

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5 వారలను పూర్తి చేసుకుని ఇప్పుడు 6 వ వారం లో అడుగు పెట్టింది. కాగా సినిమా మొత్తం మీద 5 వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 81.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 145 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసినట్లు సమాచారం.

కాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో మొట్టమొదటగా బ్రేక్ ఈవెన్ అయిన ఏరియాగా గుంటూరు ఏరియా అని చెప్పొచ్చు. గుంటూరు లో సినిమా బిజినెస్ 5.7 కోట్ల బిజినెస్ చేయగా మొత్తం మీద ఇప్పటి వరకు 6.36 కోట్లవరకు షేర్ ని అందుకుంది.

కాగా అక్కడ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ కూడా 6 కోట్ల మార్క్ ని క్రాస్ చేయగా ఇలా వరుసగా రెండు సార్లు ఈ మార్క్ ని క్రాస్ చేసిన ఓకే ఒక్క హీరోగా సంచలన రికార్డును ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. లాంగ్ రన్ లో అనుకున్న విధంగానే జనతాగ్యారేజ్ ని దాటేసినా ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో తిరుగులేని రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here