పవర్ స్టారా మజాకా…16 గంటలు ట్రెండింగ్…యూట్యూబ్ రికార్డులు…ఒకేఒక్కడు

0
1245

  హిట్స్ కి ఫ్లాఫ్స్ కి ఏమాత్రం సంభందం లేకుండా సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకుపోయే హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. బాక్స్ ఆఫీస్ దగ్గర అత్తారింటికి దారేది తర్వాత నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన కెరీర్ లోనే ప్రతిష్టాత్మక 25 వ సినిమా అయిన (అజ్ఞాతవాసి) తో సంక్రాంతి బరిలో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే.

కాగా సినిమాలోని మొదటి లిరికల్ వీడియోని రీసెంట్ గా లాంచ్ చేయగా సోషల్ మీడియా లో అది ఓ రేంజ్ లో వైరల్ అయింది. అనిరుద్ సంగీతం ఓ రేంజ్ లో పండగా సాంగ్ క్యాచీగా ఉండటం నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టించింది ఈ సాంగ్.

కాగా 16 గంటలు ట్రెండ్ అయిన ఈ సాంగ్ యూట్యూబ్ లోను ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ మరియు 1.5 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఇలా పవన్ సోషల్ మీడియా లో తనకి ఉన్న క్రేజ్ పవర్ ఏంటో మరోసారి రుజువు చేస్తూ దూసుకు పోతున్నాడు. కాగా త్వరలోనే సినిమా టైటిల్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here