కన్నడ గడ్డపై 8 కోట్లు… బాలకృష్ణ అరాచకం!

0
2371

నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జార్గాల మూడి కాంబినేషన్ లో గౌతమి పుత్ర శత కర్ని సినిమా తర్వాత వస్తున్న సినిమా ఎన్‌టి‌ఆర్ బయోపిక్. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా వస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ బిజినెస్ పరంగా ఇప్పటి నుండే దుమ్ము లేపు తుంది.

అందులో భాగంగా సినిమా కర్నాటక ఏరియా కి గాను ఓవరాల్ గా రెండు పార్టులు(ఇంకా కంఫామ్ కాలేదు) కలిపి ఏకంగా 8 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించిందని అంటున్నారు. ఇది నిజంగానే ఊహకందని భీభత్సం అని చెప్పాలి. బాలయ్య కెరీర్ లో ఇది ఆల్ టైమ్ రికార్డ్.

అంతే కాకుండా టాలీవుడ్ హిస్టరీ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రేటు దక్కించుకున్న సినిమాల జాబితా లో కూడా ఈ సినిమా ఒకటిగా చేరింది. ఇక ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ 70% కి పైగా పూర్తి అవ్వగా రెండో భాగం షూటింగ్ 40% కి మించి అయిందట. జనవరి లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here