బాహుబలి 2 TRP రేటింగ్…భీభత్సమే కానీ టెంపర్ ని కొట్టలే!!

0
4969

  టాలీవుడ్ ఎపిక్ వండర్ బాహుబలి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి భీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే.. మొదటి పార్ట్ ని మించి రెండో పార్ట్ వీర లెవల్ లో విద్వంసం సృష్టించగా బుల్లి తెరపై కూడా ఈ సినిమాలు సంచలన TRP రేటింగ్ తో దుమ్ము దుమారం చేశాయి అని చెప్పొచ్చు. కాగా రీసెంట్ గా టెలికాస్ట్ అయిన బాహుబలి 2 సినిమా కి దిమ్మతిరిగే TRP రేటింగ్ రావడం జరిగింది.

ఈ సినిమాకు ఏకంగా 22.70 TRP రేటింగ్ వచ్చినట్లు సమాచారం. ఇది ఆల్ టైం రికార్డ్ లెవల్ TRP రేటింగ్ అని చెప్పొచ్చు. తెలుగులోనే కాకుండా తమిళ్ మరియు హిందీ భాషల్లోను దుమ్ము లేపే TRP రేటింగ్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా TRP రేటింగ్ ని అఫీషియల్ గా ఇండియన్ బ్రాడ్ కాస్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

కానీ BARK అఫీషియల్ గా లేని సమయంలో టాలీవుడ్ టెలివిజన్ రికార్డులు తిరగరాసిన ఎన్టీఆర్ టెంపర్ సినిమా 26 TRP రేటింగ్ ని ఈ సినిమా అందుకోలేకపోయింది. దాంతో TRP రేటింగ్ విషయంలో ఇప్పటికీ ఎన్టీఆర్ నటించిన టెంపర్ అల్టిమేట్ లెవల్ 26 TRP రేటింగ్ తో టాప్ ప్లేస్ లో కొనసాగుతూనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here