కేరళ గడ్డపై భరత్ అనే నేను ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో తెలుసా??

0
651

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా నాలుగు వారలను ముగించుకుని మంచి వసూళ్ళతో ఇప్పటికీ స్టడీ గా కొనసాగుతుండగా ఇప్పుడు సినిమా త్వరలోనే తమిళ్ మరియు మలయాళంలో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. డబ్బింగ్ పనులు కూడా చకా చకా జరుగుతుండగా సినిమా 25 న అక్కడ రిలీజ్ కానుంది.

కాగా కేరళలో ఈ సినిమాను భారీ గానే రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ఇది వరకు మహేష్ నటించిన సినిమాలలో స్పైడర్ సినిమాను సుమారు 60 థియేటర్స్ లో రిలీజ్ చేశారు. కాగా ఇప్పుడు భరత్ అనే నేను సినిమా ను అక్కడ సుమారు 90 నుండి 100 థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది.

డైరెక్ట్ తెలుగు వర్షన్ తోనే అక్కడ భరత్ అనే నేను అక్కడ 14 లక్షల గ్రాస్ ని వసూల్ చేసి డైరెక్ట్ తెలుగు సినిమాల పరంగా రికార్డ్ కొట్టింది. మరి ఇప్పుడు డబ్ అయ్యి రిలీజ్ అవుతున్న నేపధ్యంలో అక్కడ ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందా అని ఇప్పుడు అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here