సూపర్ స్టార్ భరత్ అనే నేను ఫస్ట్ లుక్ డేట్…ఫ్యాన్స్ కి పూనకాలే

0
2006

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి 1 నేనొక్కడినే నుండి చేసిన సినిమాల్లో ఒక్క శ్రీమంతుడు మాత్రమె అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. కాగా ఆ తర్వాత చేసిన బ్రహ్మోత్సవం తీవ్ర నిరాశని మిగిలించగా రీసెంట్ గా రిలీజ్ చేసిన స్పైడర్ అయితే అంచనాలను ఏమాత్రం అందుకోలేక భారీ డిసాస్టర్ గా మిగిలిపోయింది. ఇలాంటి సమయంలో మహేష్ తనకి శ్రీమంతుడు ఇచ్చిన కొరటాలతో వస్తున్నాడు.

భరత్ అనే నేను అంటూ వస్తున్న ఈ క్రేజీ మూవీ కి భారీ హైప్ నెలకొంది.  దానికి కారణం కొరటాల మహేష్ ల శ్రీమంతుడు దిమ్మతిరిగే హిట్ అవ్వడం అలాగే కొరటాల ఇప్పుడు సూపర్ డూపర్ ఫామ్ లో ఉండటం అని చెప్పోచ్చు. సినిమాను మొదట్లో సంక్రాంతి కి రిలీజ్ అనుకున్నారు కానీ కుదరలేదు.

ఇప్పుడు సమ్మర్ లో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని సంక్రాంతి కి రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. దాంతో ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఆ లుక్ కోసం ఎదురుచూడటం మొదలు పెట్టారు. కాగా సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో మహేష్ ఏ రేంజ్ రచ్చ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here