3.8 కోట్లతో రైట్స్ కొంటే టోటల్ కలెక్షన్స్ ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
2685

  అందరికీ గుర్తుండే ఉంటుంది…. 2016 లో బ్రహ్మోత్సవం సినిమా సమయంలో రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీ బిచ్చగాడు…. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించాడు…. కేవలం 40 లక్షలు పెట్టి రైట్స్ కొనగా సినిమా టోటల్ రన్ లో ఏకంగా 17 కోట్లకు పైగా షేర్ ని అందుకుని అల్టిమేట్ విజయాన్ని సొంతం చేసుకుంది…దాంతో ఆ సినిమా హీరో విజయ్ ఆంటోని కి మంచి క్రేజ్ ఏర్పడింది తెలుగు లో…

కానీ బిచ్చగాడు కి ముందు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసిన విజయ్ అంటోని తర్వాత మాత్రం సాదాసీదా స్టొరీలు చేయడం తో ఆ క్రేజ్ మొత్తం పోయింది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరు చేతుల మీదుగా ఇంద్రసేన అంటూ తన తమిళ్ డబ్బింగ్ మూవీతో వచ్చాడు విజయ్ అంటోని.

సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ సుమారు 3.8 కోట్ల రేంజ్ లో పలకగా సినిమా మొదటి ఆటకే బిలో యావరేజ్ టాక్ తెచ్చుకోగా వీకెండ్ తర్వాత పూర్తిగా వాషౌట్ అయిపొయింది. దాంతో సినిమా కలెక్షన్స్ ఇప్పుడు మొత్తంగా 67 లక్షలు మాత్రమే రావడం టోటల్ రన్ లో 80 లక్షలు క్రాస్ అయ్యే చాన్స్ లేదు అని అంటుండటంతో సినిమాకు మొత్తంగా 3.1 కోట్ల నష్టం పక్కా అని అంటున్నారు. దాంతో శాటిలైట్ రైట్స్ పైనే ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమాను కొన్నవాళ్ళు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here