20 ఏళ్ల ట్రాక్ రికార్డును నమ్ముకున్న మెగాస్టార్ చిరంజీవి

0
355

chirus-thsmtమెగాస్టార్ చిరంజీవి దాదాపు 8 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేస్తున్న సినిమా “ఖైది నంబర్ 150”. తమిళ్ బ్లాక్ బస్టర్ కత్తి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా అందుకు తగ్గట్లే అత్యంత భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ని చేసింది ఈ సినిమా.

కాగా ఈ సినిమా ఎట్టి పరిస్థితులలోను విజయం సాధించడం ఖాయమని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. డానికి సినిమా అవుట్ పుట్ ఒక కారణం అయితే లాస్ట్ 20 ఏళ్లలో మెగాస్టార్ కి ఉన్న ట్రాక్ రికార్డు కూడా ఒక కారణం అని అంటున్నారు.

గత 20 ఏళ్లలో మెగాస్టార్ నటించిన సినిమాల్లో ప్రేక్షకుల నుండి పూర్తిగా నిరాశపరిచిన సినిమాగా ఒక్క ఇద్దరు మిత్రులు మాత్రమే నిలిచిందని, అది కాకుండా కమర్షియల్ గా ఫ్లాఫ్ అనిపించుకున్న అంజి, జై చిరంజీవ కూడా పెట్టిన పెట్టుబడిని రాబట్టాయని అంటున్నారు. ఇదే సెంటిమెంట్ ని నమ్ముకుని ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY