T2B 2016 Best::-బిగ్గెస్ట్ ఓపెనర్ ఆఫ్ ది ఇయర్

0
963

ఈ ఇయర్ దాదాపు 180 కి పైగా తెలుగు సినిమాలు థియేటర్స్ లో అడుగుపెట్టాయి…వాటిలో హిట్ అయిన సినిమాలు వేళ్ళ మీదే లెక్కపెట్టొచ్చు. కాగా తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో అలాగే వరల్డ్ వైడ్ గా దుమ్ము రేపిన సినిమాలు రెండు ఉన్నాయి.

ఒకటి సర్దార్ గబ్బర్ సింగ్ మరోటి జనతాగ్యారేజ్…ఈ రెండు సినిమాల్లో తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ గబ్బర్ సింగ్ హిస్టారికల్ 21.70 కోట్ల షేర్ వసూల్ చేయగా జనతాగ్యారేజ్ 20.60 కోట్ల షేర్ వసూల్ చేసి టాప్ ప్లేసులను దక్కించుకున్నాయి.

కాగా ఇండియాలో మొత్తంమీద సర్దార్ గబ్బర్ సింగ్ 24.80 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 26.50 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా జనతాగ్యారేజ్ ఇండియా వైడ్ గా 25.10 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 27 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. రెండు సినిమాల కలెక్షన్స్ ని కర్ణాటక ఏరియా డిసైడ్ చేసింది అని చెప్పొచ్చు.

అక్కడ సర్దార్ కన్నా జనతాగ్యారేజ్ కి 1 కోటి ఎక్కువ షేర్ వచ్చింది. దాంతో ఓవరాల్ గా బిగ్గెస్ట్ ఓపనర్ ఆఫ్ ది ఇయర్ గా జనతాగ్యారేజ్ నిలవగా 2 స్టేట్స్ లో మాత్రం సర్దార్ గబ్బర్ సింగ్ టాప్ ప్లేస్ ని కైవసం చేసుకుంది.

LEAVE A REPLY