T2B 2016 Best::-అత్యధిక లాభం తెచ్చిపెట్టిన సినిమా ఇదే

0
1527

2016 లో భారీ సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి వచ్చిన కలెక్షన్స్ కి లెక్కెస్తే మాత్రం బిగ్గెస్ట్ హిట్ ఏది అంటే అది కచ్చితంగా చిన్న సినిమానే అని చెప్పాలి…కాగా ఓ పెద్ద సినిమా కూడా ఈ లిస్టులో ఉన్నా ఆ రెండు సినిమాల్లో ఏది బెస్టో మీరే డిసైడ్ చేయండి…

ఈ ఇయర్ రిలీజ్ అయిన పెద్ద సినిమాల్లో తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా సరైనోడు…సుమారు 45 కోట్ల బిజినెస్ చేసి ఎక్కువగా ఓన్ గా రిలీజ్ అయిన ఈ సినిమా 30 కోట్ల టోటల్ లాభం దక్కించుకుంది. ఇక మరో పెద్ద సినిమా సోగ్గాడే చిన్నినాయనా కూడా 26 కోట్ల బిజినెస్ చేసి 50 కోట్ల షేర్ సాధించి సంక్రాంతి రియల్ బ్లాక్ బస్టర్ అయింది.

ఇక చిన్న సినిమాల్లో పెళ్లిచూపులు 1.4 కోట్లకు అమ్ముడై మొత్తంగా 19 కోట్ల షేర్ ని వసూల్ చేసింది…ఇదే గొప్ప అనుకుంటే డీమానిటైజేషన్ లో వచ్చిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమా 3.25 కోట్ల బిజినెస్ చేసి మొత్తంగా 24 కోట్లవరకు షేర్ వసూల్ చేసినట్లు అంచనా వేస్తున్నారు.

మరి ఈ సినిమాల్లో ఏది గొప్ప అంటే డీమానిటైజేషన్ లో దుమ్మురేపిన ఎక్కడికిపోతావు చిన్నవాడాకి మా ఓటు అంటాం….మరి మీ దృష్టిలో ఏది బిగ్గెస్ట్ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి..

LEAVE A REPLY