3 టికెట్స్ ధర 36 లక్షలు….మాస్ హిస్టీరియా ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి

0
4144

మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ 2017 ఖైదీనంబర్150 క్రేజ్ రిలీజ్ సమయానికి ఆకాశాన్ని మించిపోయింది అని చెప్పొచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీ 9 ఏళ్లుగా ఓ ఎంపేరర్ ని కోల్పోయింది అనేది ఇప్పుడు సుస్పష్టంగా తెలుస్తుంది.

రీ ఎంట్రీలో రీమేక్ ని చేస్తున్నా ఆ సినిమా కథ అందరికీ తెలిసిందే అయినా ఖైదీనంబర్150 ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేము…డానికి నిదర్శనం బెంగళూర్ లోని ఓ థియేటర్ లో 3 టికెట్లను వేలం వెయ్యగా 3 ఆ టికెట్స్ ని 36 లక్షలకు వేలం పాడి గెలిచారట.

ఆ వేలం డబ్బులను మెగాస్టార్ పేరిట ఓ అనాధాశ్రయముకి విరాళంగా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ క్రేజ్ ఈ రేంజ్ లో ఉందని చెప్పడానికి ఇదో నిదర్శనం మాత్రమే…ఇక సినిమా రిలీజ్ అయ్యి యునానిమస్ హిట్ టాక్ ని తెచ్చుకుంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా కనివినీ ఎరగని రేంజ్ లో ఉండటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY