60 కోట్లతో సినిమా తీస్తే 4 కోట్ల షేర్ వచ్చింది….ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ డిసాస్టర్ ఈ సినిమానే

0
46471

60-crbnssm-tbsఆ డైరెక్టర్ చివరి సినిమా బయోపిక్ క్యాటగిరిలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్..అలాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఫస్ట్ లుక్-టీసర్ రిలీజ్ అయినప్పుడు అలానే అనిపించినా ట్రైలర్ రిలీజ్ నుండి సినిమాపై ఉన్న హైప్ రోజురోజికి తగ్గుతూ రిలీజ్ నాటికి అసలు పట్టించుకున్న వారే లేక ఆల్ టైం హిస్టారికల్ డిసాస్టర్ గా మిగిలిపోయింది.

ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా….భాగ్ మిల్కా భాగ్ లాంటి హిస్టారికల్ బయోపిక్ తీసిన రాఖేష్ ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్షన్ లో అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ నటించిన తొలి సినిమా మీర్జియా…సుమారు 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తొలి ఆటకే హిస్టారికల్ డిసాస్టర్ టాక్ తెచ్చుకుని 9 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

ఇక మొత్తంగా 4 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ సినిమా మార్కెటింగ్ అండ్ ప్రింట్ ఖర్చులు కూడా తీసుకురాలేక మొత్తంగా 70 కోట్లకు పైగా నష్టాన్ని తెచ్చుకుంది. 2015 ఇయర్ లో రణబీర్ కపూర్ హీరోగా చేసిన బాంబే వాల్వేట్ 60 కోట్ల నష్టం తెచ్చి టాప్ ప్లేస్ దక్కించుకోగా ఇప్పుడు ఆ ప్లేస్ ని రిప్లేస్ చేసి టాప్ పొజిషన్ లో నిలిచి హీరోగా హర్షవర్ధన్ కెరీర్ కి అడ్డుకట్టగా నిలిచింది.

LEAVE A REPLY