7 వ సారి ఆ మార్క్ అందుకుని చరిత్ర సృష్టించిన రామ్ చరణ్

0
1261

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో రేర్ రికార్డును అందుకున్నాడు….టాలీవుడ్ చరిత్రలో మరే హీరో సాధించని ఆల్ టైం హిస్టారికల్ అచీవ్ మెంట్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు రామ్ చరణ్ కెరీర్ లో 10 సినిమాలు చేయగా అందులో 7 వ సారి 40 కోట్ల మార్క్ ని అందుకుని చరిత్ర సృష్టించాడు.

చిరుత, ఆరెంజ్ మరియు జంజీర్ సినిమాలను తప్పిస్తే మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల మార్క్ ని అందుకున్నవే. ఇలా కెరీర్ లో ఎక్కువ 40 కోట్ల సినిమాలు ఉన్న మరే హీరో లేడంటే రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

రామ్ చరణ్ కెరీర్ ని చిరుత తర్వాత పరిశీలిస్తే పాజిటివ్ టాక్ వస్తే అది కచ్చితంగా 40 కోట్ల మార్క్ ని అందుకుంది…ఇక 2015 లో బ్రూస్ లీతో డిసాస్టర్ టాక్ వచ్చినా 40 కోట్ల మార్క్ అందుకుని సంచలనం సృష్టించాడు రామ్ చరణ్. ఇప్పుడు ధృవతో మరోసారి సత్తా చాటుకున్నాడు.

LEAVE A REPLY