షాకింగ్:-అఫీషియల్ [email protected] ( బయపడుతున్న ఇండస్ట్రీ)

2
6763

టాలీవుడ్ ఆల్ టైం మెగాస్టార్ చిరంజీవి నటించిన మెగా కంబ్యాక్ మూవీ ఖైదీనంబర్150 బాక్స్ ఆఫీస్ దగ్గర మరి కొన్ని రోజుల్లో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతుంది. మాస్ అండ్ క్లాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.

కాగా సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ బయటికి వచ్చేయడం ఇప్పుడు ట్రేడ్ ని నిజంగానే తికమక పెడుతుంది అని చెప్పొచ్చు. టాలీవుడ్ చరిత్రలో ఏ సినిమాకి జరగనంత బిజినెస్ ఖైదీనంబర్150 కి జరిగింది. నైజాం ఏరియాలో కనీవినీ ఎరగని రీతిలో 23 కోట్లకు, సీడెడ్ లో 11.80 కోట్లకు టోటల్ ఆంధ్రాలో 32 కోట్లకు బిజినెస్ చేసింది ఖైదీనంబర్150 సినిమా.

ఇక కర్ణాటకలో 8.5 కోట్లు….ఓవర్సీస్ లో 12 కోట్ల బిజినెస్ చేసిన ఖైదీనంబర్150 మిగిలిన ఏరియాల్లో మరో 3 కోట్ల బిజినెస్ చేసింది. దాంతో మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్లకు చేరుకొని చరిత్ర సృష్టించగా క్లీన్ హిట్ కోసం ఏకంగా 91 కోట్లు కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొంది. అంటే బాహుబలి తర్వాత ఇండస్ట్రీ హిట్ అయిన శ్రీమంతుడు 87.40 కోట్లకు 4 కోట్లు ఎక్కువగా సంక్రాంతి పోరులో బాలయ్య చారిత్రిక 100 వ సినిమాను ఎదుర్కొని సాధించాలి..

ఈ రికార్డు బిజినెస్ కి పులకి౦చినా కూడా బ్రేక్ ఈవెన్ కి బయపడుతున్నారు బయ్యర్లు-డిస్ట్రిబ్యూటర్లు, కానీ ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం సినిమా అద్బుతంగా వచ్చిందన్న టాక్ కి తోడు మెగా కంబ్యాక్ మూవీ అవ్వడంతో ఆశలు మిగిలున్నాయి..ఇక మీరు చెప్పండి ఏం జరుగుంది అనుకుంటున్నారా….కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

2 COMMENTS

LEAVE A REPLY