“అ…ఆ” మూవీ కామన్ ఆడియన్స్ టాక్ ఏంటీ???

0
1412

దాదాపు ఏడాది తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో కొత్త సినిమా వచ్చింది. ఇప్పటివరకు త్రివిక్రమ్ తీసిన సినిమాలు క్రిటిక్స్ చేత 3 స్టార్స్ ని ఇప్పించడంలో విఫలం అయినా త్రివిక్రమ్ మాటల్లో ఉండే గారడీ నచ్చిన ప్రేక్షకులు ఆ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు.

లాస్ట్ ఇయర్ సన్ ఆఫ్ సత్యమూర్తి బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇలాంటి పరిస్థితిలో నితిన్-సమంత జోడిగా వచ్చిన అ…ఆ ప్రేక్షకులను ఆకట్టుకు౦టు౦దా లేదా అనే డౌట్ నెలకొన్నా సినిమా టాక్ మాత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందని వస్తుంది.

nithin samntha movie reviewసినిమాలో పెద్దగా కథ లేకున్నా త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో ఫస్టాఫ్ ఫాస్ట్ గా సాగగా సెకెండాఫ్ లో అసలు కథ ఎంటర్ అయినా కొంచం స్లోగా సాగినా ఫీలింగ్ కలుగుతుంది. మొదటి నుండి అనుకున్నట్లుగానే సినిమాలో కథ ఎక్కువగా సమంత చుట్టూనే తిరుగుతుంది.

నితిన్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా సమంత సినిమాకు మేజర్ హైలెట్ గా నిలిచింది. ఇక ప్రేమమ్ ఫేం అనుపమ రోల్ కన్నా ఆమె లుక్స్ తోనే ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. మిగిలిన పాత్రలన్నీ తమ పరిదిమేర ఆకట్టుకున్నాయి.

మిక్కీ జే మేయర్ స్వరాలు సినిమాకు మేజర్ హైలెట్స్ అని చెప్పొచ్చు. సినిమా ఫస్ట్ ఫ్రేం నుండి ఆకట్టుకుంటూ సెకండాఫ్ లో కొద్దిగా స్లో అయినా తిరిగి క్లైమాక్స్ లో ఆకట్టుకు౦ది. త్రివిక్రమ్ తన చివరి సినిమాల లా ఇందులో మరీ ఎక్కువ పంచులు వేయలేదు.

ఈ మధ్యకాలంలో ఇలాంటి సున్నితమైన కథతో వచ్చిన నేను..శైలజ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో అ..ఆ కూడా ఆ రేంజ్ లోనే ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. సమ్మర్ లో మాస్ ని ఆకట్టుకునే సినిమాలు వచ్చినా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే సినిమా మాత్రం రాలేదు. వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి.

దాంతో అ…ఆ ఆ లోటుని తీరుస్తూ మిగిలున్న సెలవులలో ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటున్నారు. సో ఓవరాల్ గా నితిన్ కి కొరియర్ బాయ్ అండ్ సమంతకి బ్రహ్మోత్సవం తరువాత హిట్ పడినట్లే అనిపిస్తుంది.

LEAVE A REPLY