ఒంటరిగా మిగిలి పోయిన బాలయ్య…..అదే ఎన్టీఆర్ ని పిలిచి ఉంటే……..?????

5
3586

సంక్రాంతికి బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మక 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి వస్తుంది అని తెలిసి ఎంతో ఎగ్జిట్ అయ్యారు అందరు..కానీ తర్వాత మెగాస్టార్ 150 సినిమా ఖైదీనంబర్150 కూడా దిగుతుంది అని తెలియడంతో ఏది ఎక్కువ క్రేజ్ ఉంటే ఆ సినిమా ఆడుతుంది అనుకున్నారు.

మొదట్లో గౌతమీపుత్ర శాతకర్ణి ఫుల్ లీడింగ్ లో దూసుకుపోయి ట్రైలర్ రిలీజ్ వరకు పైచేయి సాధించింది…ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ కూడా బాలయ్యపై అభిమానంతో తిరిగి కలిసే ప్రయత్నం చేసినా బాలయ్య డానికి సంసిద్ధం కాలేదు.

కానీ తర్వాత ఖైదీనంబర్150 చూపించిన జోరులో గౌతమీపుత్ర శాతకర్ణి గురించి పట్టించుకోవడమే మానేశారు అందరూ…ఎక్కడ చూసిన మెగాస్టార్ గురించే చర్చలు ఇంటర్వ్యూలు, యూట్యూబ్ లో రికార్డులు…ఇలా బాలయ్య సినిమాకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బాలయ్య ఎన్టీఆర్ ని పిలిచి ఉంటే ఫుల్ సపోర్ట్ ఇచ్చేవారు కానీ బాలయ్య అలా చేయకపోవడంతో వెనక్కి తగ్గారు..దాంతో ఇప్పుడు ఖైదీసునామీని ఎలా తట్టుకోవాలో తెలియక గౌతమీపుత్ర శాతకర్ణి టీం తలపట్టుకుంది…టోటల్ వీకెండ్ టికెట్స్ అన్నీ ఖైదీకి సేల్ అవ్వగా బాలయ్య సినిమాకి తొలిరోజు టికెట్స్ కూడా ఇప్పటికీ అందుబాటులో ఉండటం ప్రస్తుత పరిస్థితిని క్లియర్ గా చెప్పే ఆన్సర్ అని చెప్పొచ్చు.

ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ కూడా తోడుగా ఉంటే కచ్చితంగా క్రేజ్ మరో విధంగా ఉండేదని అంటున్నారు విశ్లేషకులు-ట్రేడ్ పండితులు…కానీ అలా జరగకపోవడంతో ఒంటరిగానే యుద్ధం చేయాల్సి వస్తుంది బాలయ్యకి…ఖైదీకి టాక్ కూడా బాగుండటం మరో మైనస్ పాయింట్ అయ్యింది బాలయ్య సినిమాకి.

ఇప్పుడు మగధీర-బాహుబలి రేంజ్ టాక్ బాలయ్య సినిమాకి వస్తేకానీ తిరిగి జోరు చూపించే పరిస్థితి లేదు…మరి క్రిష్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో ఒక్కరోజు ఆగితే తెలిసిపోతుంది…ఈ పరిస్థితిపై మీ కామెంట్స్ కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి….

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

5 COMMENTS

  1. చెప్పడానికి ఏముంది మీరు చెప్పింది100% కరక్టే అందులో సందేహంలేదు

LEAVE A REPLY