గౌతమీపుత్ర శాతకర్ణి “ప్రీమియర్ షో” కి ఎన్టీఆర్!!

0
2297

అందరూ అనుకున్నా బాలయ్య 100 వ సినిమా ఆడియో వేడుకకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రానున్నారని..కానీ చివరికి ఆ ఆశలు నెరవేరలేదు..దీనికి రెండు రీజన్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి..ఒకటి బాలయ్య ఇంకా మెత్తబడలేదని మరోటి ఒకవేళ ఎన్టీఆర్ వస్తే విడిపోవడానికి కారణాలు వెతుక్కోవాల్సి వస్తుందని అని చెబుతున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బాలయ్య 100 వ సినిమా జనవరి 12 న అత్యంత భారీగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది…కాగా సినిమా ప్రీమియర్ షోలు 11 నే మొదలు కావడం జరుగుతుందని డైరెక్టర్ క్రిష్ తెలియజేశాడు.

కాగా అంతకన్నా ముందు మూవీ స్పెషల్ ప్రీమియర్ షో ఒకటి హైదరాబాదులో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖులు అందరూ ఈ షో కి వస్తారని అందులో ఎన్టీఆర్ కూడా ఉండబోతునట్లు చెబుతున్నారు. మరి ఇదైనా నిజమా కాదా కొన్ని రోజులు ఆగితే కానీ కన్ఫాం అయ్యేలా లేదు.

LEAVE A REPLY