భేతాలుడు మూవీ మినీ రివ్యూ…కామన్ ఆడియన్స్ టాక్

0
745

bhebtbsn2016 టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన సినిమాల్లో అతి తక్కువ బడ్జెట్ తో అత్యధిక షేర్ సాధించిన సినిమా ఏదైనా ఉందీ అంటే అది కచ్చితంగా బిచ్చగాడు అనే చెప్పాలి. అవడానికి డబ్బింగ్ సినిమానే అయినా తెలుగునాట ఏ తమిళ్ సినిమా సృష్టించని చరిత్ర ఈ సినిమా కి ఉంది.

ఆ సినిమా పుణ్యానే విజయ్ అంటోని తదుపరి సినిమా “భేతాలుడు” తెలుగులో భారీ అంచనాలు నెలకొన్నాయి…ఆ అంచనాలను సినిమా అందుకుందా లేదా అంటే…ఆల్ మోస్ట్ అందుకున్నట్లే అనిపించినా చివర్లో మిస్ అయిందనే చెప్పాలి.

సినిమాకి కామన్ ఆడియన్స్ నుండి వినిపిస్తున్న టాక్ ఏంటంటే మొదటి అర్ధభాగం హై స్పీడ్ తో సాగుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని మిగుల్చుతుంది…ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకెండాఫ్ పై అంచనాలు మరింతగా పెరిగిపోతాయి.

కానీ ఆ అంచనాలను అందుకోవడంలో అంతగా సక్సెస్ కాలేదు భేతాలుడు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఎక్స్ లెంట్ ఫస్టాఫ్ కి యావరేజ్ సెకెండాఫ్ కలిసి మొత్తంగా మాత్రం పాస్ మార్కులు కొట్టేశాడు అని చెప్పొచ్చు.

సినిమా సినిమాకి డిఫెరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్న విజయ్ అంటోని ఈ సారి కూడా పాస్ అయ్యాడు అంటున్నారు. తెలుగులో కన్నా తమిళ్ లో బెటర్ టాక్ ఉందని అంటున్నారు…కానీ ఓవరాల్ గా చూసుకుంటే బిచ్చగాడు రేంజ్ కాకున్నా డబ్బింగ్ సినిమాల్లో బిచ్చగాడు తర్వాత స్థానం ఈ సినిమాదే అనొచ్చు…

LEAVE A REPLY