మహేష్ “బ్రహ్మోత్సవం” కామన్ ఆడియన్స్ టాక్ ఏంటి??

3
2460

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత చేసిన సినిమా బ్రహ్మోత్సవం ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు తరువాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు ఓవరాల్ గా బిలో యావరేజ్ టాక్ వచ్చింది.

brahmostavam talkమహేష్ లాంటి క్లాస్ హీరో-యూత్ లో క్రేజ్ ఉన్న హీరోతో అతితక్కువ డైలాగ్స్ మాట్లాడించిన శ్రీకాంత్ అడ్డాల ప్రతీ 8 నిమిషాల గ్యాప్ లో ఓ పాట పెట్టి సినిమా టెంపో మిస్ లీడ్ చేశాడు. నరేషన్ స్లోగా ఉండటంతో యూత్ కి అస్సలు ఎక్కడం లేదు బ్రహ్మోత్సవం.

కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉండటం, మహేష్ కి భారీ ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉండటం ఒక్కటే సినిమాను సేవ్ చేసే అంశమని అంటున్నారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో సినిమాలకు మహారాజపోషకులు అయిన యూత్ అండ్ మాస్ కి సినిమా ఎక్కకపోవడం నిరాశ కలిగించే అంశమే.

శ్రీకాంత్ అడ్డాల తీసిన సినిమాల్లో బ్రహ్మోత్సవం లీస్ట్ లో ఉంటుందని ప్రతీ చోటా వినిపిస్తున్న ప్రధాన మాట. అలాగే మహేష్ కి ఒక హిట్ ఇచ్చిన దర్శకుడు రెండో ప్రయత్నంలో మళ్ళీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేదు అనే బ్యాడ్ టాక్ ఇండస్ట్రీలో ఉంది.

ఈ సెంటిమెంట్ కి బ్రహ్మోత్సవం చెక్ పెడుతుంది అనుకున్నా ఇప్పుడు సినిమాకు వస్తున్న టాక్ కి, సినిమా చేసిన 74 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ దెబ్బ కొట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇదంతా జరగకూడదు అనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ భారీ సంఖ్యలో వస్తేసే సేఫ్ అయ్యే చాన్స్ ఎంతోకొంత ఉంటుందని అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

3 COMMENTS

  1. An attentiongrabbing dialogue is worth comment. I believe that you must write extra on this subject, it won’t be a taboo topic but typically persons are not enough to speak on such topics. To the next. Cheers edeeebdkgfakddfb

LEAVE A REPLY