ధృవ ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్ & సెకెండ్ డే అడ్వాన్స్ బుకింగ్ స్టేటస్

0
3099

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ధృవ…తొలిరోజు రెండు తెలుగురాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్ ని దక్కించుకుంది…ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఓపెనర్స్ సర్దార్ అండ్ జనతాగ్యారేజ్ ల అంత కాకున్నా సరైనోడు బ్రహ్మోత్సవం కన్నా బెటర్ గా ఓపెనింగ్ వచ్చిందని చెప్పొచ్చు.

ఇలా జరగడానికి ప్రదాన కారణం డీమానిటైజేషన్ అని వేరే చెప్పాల్సిన అవసరం..కాగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ధృవ 13 నుండి 15 కోట్ల మధ్యలో షేర్ వసూల్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టాక్ బాగుండటంతో రోజు పూర్తి అయ్యే సమయానికి మరింత జోరు అందుకునే అవకాశం కూడా ఉందట.

కాగా రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్ జోరు అందుకుంది…చాలా ఏరియాల్లో మొదటిరోజుతో పోల్చితే బుకింగ్స్ లెవల్ కొద్దిగా తగ్గినా ప్రస్తుతం ఉన్న పరిస్థితులనడుమ ఇది నిజంగా రామ్ చరణ్ స్టార్ పవర్ వల్లే జరుగుతున్న బుకింగ్ అని అంటున్నారు..సినిమా మొదటిరోజు అఫీషియల్ కలెక్షన్స్ కోసం చూస్తూనే ఉండండి….

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY