ధృవ..”లాస్ట్ డే” కలెక్షన్స్ అప్ డేట్( ఆ మార్క్ కొట్టడం ఇవాళ పక్కా )

0
1702

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇవాళ చివరి రోజుని ఎంజాయ్ చేస్తుంది…చివరి రోజు అని ఎందుకు అంటున్నాం అంటే బహుశా రేపటి నుండి ధృవ థియేటర్స్ ఆల్ మోస్ట్ ఖాళీ అవ్వడం ఖాయం…డానికి రీజన్ సంక్రాంతి న్యూ మూవీస్.

కాగా అందుకే ఈ రోజును ఎంత వాడుకోవాలో అంతా వాడుకుంటుంది ధృవ సినిమా…ఇప్పటికి 57.40 కోట్ల షేర్ వసూల్ చేసిన ధృవ ఈ రోజు కచ్చితంగా 50 లక్షల పైచిలుకు షేర్ ని వసూల్ చేయడం ఖాయం అని చెప్పొచ్చు.

దాంతో కలెక్షన్స్ 58 కోట్లకు అటూఇటూగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం ధృవ క్లీన్ హిట్ కొట్టాలి అంటే కచ్చితంగా 58 కోట్ల మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది…ఇక అందుకోబోతుంది కాబట్టి ధృవ హిట్ కిందే లెక్క.. అసలు కలెక్షన్స్ ఎన్ని అనేది రేపు అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY