ధృవ ఓవర్సీస్ వీకెండ్ కలెక్షన్స్ అప్ డేట్( ఆదివారం షాకింగ్ రిపోర్ట్)

0
2207

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్ట్రాంగ్ గా సాగిపోతూ కలెక్షన్స్ ని సాధించింది. కాగా ఓవర్సీస్ లో రెండోరోజు వరకు స్టడీగా కలెక్ట్ చేసిన ధృవ మూడో రోజు మాత్రం చేతులు ఎత్తేసింది.

రెండో రోజు రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం రికార్డు లెవల్ లో 344k గ్రాస్ కలెక్ట్ చేసిన ధృవ ఆదివారం మరింతగా రెచ్చిపోతుందని అనుకున్నారు. కానీ రెస్పాన్స్ మాత్రం షాకింగ్ గా అనిపించిందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

ఆదివారం టోటల్ కలెక్షన్స్ 127k మాత్రమే రావడంతో వీకెండ్ లో 1 మిలియన్ అందుకుంటుంది అనుకున్న సినిమా కాస్త మరికొన్నిరోజులు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. రామ్ చరణ్ స్వయంగా ప్రమోట్ చేయడానికి వెళ్ళడం సినిమాకు పాజిటివ్ రావడంతో ఈ మాత్రం వచ్చాయని రామ్ చరణ్ రెగ్యులర్ మసాల సినిమా చేసి ఉంటే రిజల్ట్ మరో విధంగా ఉండేదని అంటున్నారు.

LEAVE A REPLY