ధృవతో మగధీరుడు సాధించిన అల్టిమేట్ రికార్డు ఇదే

0
682

డీమానిటైజేషన్ సమయంలో రిలీజ్ అయ్యి కూడా 50 కోట్ల మార్క్ అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది ధృవ సినిమా….రామ్ చరణ్ కి నైజాం ఏరియాలో గత మూడేళ్ళలో తొలి బ్రేక్ ఈవెన్ అయిన సినిమాగా నిలిచింది ధృవ…

మగధీర తర్వాత 50 కోట్ల సినిమా లేదు అన్నవాళ్ళ నోళ్ళు మూయిస్తూ 50 కోట్ల మార్క్ ని అత్యంత క్లిష్ట పరిస్థితులలో సాధించింది ధృవ….ఇలా అనేక స్పెషల్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ధృవ సాధించిన అసలు సిసలు విజయం మాత్రం ఓవర్సీస్ లోనే అని చెప్పాలి.

చిన్న కొత్త హీరోలు సైతం అక్కడ 1 మిలియన్ ని అవలీలగా దాటేస్తున్నవేల రామ్ చరణ్ సినిమాలు అక్కడ టోటల్ గా చతికిలపడుతూ వస్తున్న నేపధ్యంలో స్వయంగా తానె బరిలోకి దిగి అక్కడ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేలా చేసిన రామ్ చరణ్ అక్కడ 1.3 మిలియన్ మార్క్ ని అందుకుని ఆల్ టైం టాప్ 10 లో ఎంటర్ అయ్యాడు. దాంతో ఇకమీదట రామ్ చరణ్ సినిమాలకు ఓవర్సీస్ లోను డోర్స్ ఓపెన్ అయినట్లు అయింది. ఇదే ధృవ సాధించిన అల్టిమేట్ రికార్డ్ అంటున్నారు ట్రేడ్ పండితులు.

LEAVE A REPLY