టాలీవుడ్ చరిత్రలో ఏ హీరోకి రాని ఆఫర్ “యంగ్ టైగర్ ఎన్టీఆర్” కి వచ్చింది

0
17200

ntr-new-offer-snsmtbnsmఇప్పటివరకు టాలీవుడ్ హీరోలకు బ్లాంక్ చెక్ లు, వాళ్లకి ఓ సినిమాకి ఇచ్చే రెమ్యూనరేషన్ కి మించి ఆఫర్ చేయడం, ఒకేసారి రెండు మూడు సినిమాలకు గుత్తగా మాట్లాడుకోవడం, లేక ఏదైనా ఏరియాలలో వచ్చే కలెక్షన్స్ ని రెమ్యూనరేషన్ గా ఇవ్వడం లాంటివి ఇప్పటివరకు జరిగాయి.

కానీ టాలీవుడ్ హిస్టరీలో మొదటిసారిగా ఓ స్టార్ హీరోకి నయా ఆఫర్ వచ్చింది. తన సినిమా తొలిరోజు ఎంత వసూల్ చేస్తే అంతమొత్తాన్ని రెమ్యూనరేషన్ కింద ఇవ్వడానికి ఓ బడా నిర్మాత ముందుకొచ్చినట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

ఆ హీరో ఎవరో తెలిసింది కానీ ఆ నిర్మాత ఎవరనేది మాత్రం తెలియరాలేదు. ఆ హీరో మరెవరో కాదు మూడు వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, 26 సినిమాలు పూర్తి చేసిన ఎన్టీఆర్ తన 27 సినిమాను త్వరలో మొదలుపెట్టబోతున్నాడు.

కాగా ఈ సినిమాకు మాకు చేయాలి అంటే మాకు చేయాలి అంటూ నిర్మాతలు ఎన్టీఆర్ చుట్టూ తిరుగుండటంతో ఓ నిర్మాత పైన చెప్పిన ఆఫర్ ఇచ్చాడట. ఇప్పుడు ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ దృశ్యా జనతాగ్యారేజ్ లాంటి సినిమా పడితే ఫస్ట్ డే ఇండియా వైడ్ గా 25 కోట్ల షేర్ ఎటూ పోదు, దాన్నే ఎన్టీఆర్ కి రెమ్యూనరేషన్ గా ఇవ్వాలని ఆ నిర్మాత ఆలోచన. ప్లాన్ బాగానే ఉంది కానీ ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా లేదా చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY