అభిమానులకు “గూస్ బంప్స్” తెప్పించాడుగా యంగ్ టైగర్

0
1855

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు వరుస హిట్ల తర్వాత చేయబోతున్న సినిమాపై ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇయర్ రిలీజ్ కాబోతున్న వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఇది ఒకటి.

కాగా ఈ సినిమాకు టైటిల్ ఏం పెడుతున్నారని ఒక చర్చ చాలారోజులుగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. నటవిశ్వరూపం అని లేదు నటరుద్ర అని కొన్ని టైటిల్స్ ప్రచారంలోకి రాగా ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఫిల్మ్ చాంబర్ లో ఓ ఆసక్తికరమైన టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు అని అంటున్నారు.

ఇందులో ట్రిపుల్ రోల్ చేయబోతున్న ఎన్టీఆర్ మూడు రోల్స్ ల పేర్లు కలిసేలా జై.లవ.కుశ అని పెట్టారని అంటున్నారు. టైటిల్ ఆసక్తిగా ఉండటంతో అభిమానులకు కూడా టైటిల్ ఓ రేంజ్ లో ఎక్కేసిందని అంటున్నారు. మరి త్వరలోనే ఓ అనౌన్స్ మెంట్ వచ్చేస్తే వాళ్ళకి అంతకుమించిన పండగ ఉండడు అని చెప్పొచ్చు.

loading...
loading...

LEAVE A REPLY