అఫీషియల్:- గౌతమీపుత్ర శాతకర్ణి……సెన్సార్ టాక్ ఇదే

0
2097

నటసింహం నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ 2017 గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ కి వారం ముందే సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది…ఎప్పటిలాగే సినిమాలకు సెన్సార్ వారి నుండి అభినందనలు వచ్చినట్లే గౌతమీపుత్ర శాతకర్ణి కూడా పాజిటివ్ బజ్ నెలకొంది.

కాగా మరింత లోతుగా చెప్పాలి అంటే సినిమా రన్ కేవలం 2 గంటల 15 నిమిషాలే ఉండటం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని అంటున్నారు…సీన్ తర్వాత సీన్ ఎక్కడా ల్యాగ్ లేకుండా క్రిష్ అద్బుతంగా తీశాడని అంటున్నారు. ఇక యుద్ద సన్నివేశాలు మగధీర-బాహుబలి రేంజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయని అంటున్నారు.

ముఖ్యంగా ఓ రెండు ఫైట్ సీన్స్ అయితే ఇప్పటివరకు చూడని విధంగా ఉన్నాయని బాలయ్య ఈ ఏజ్ లోను చాలా రిస్కీ ఫైట్స్ తో అదరగొట్టాడని అంటున్నారు…ఇక ప్లస్ లతో పాటు మైనస్ లు కూడా ఏవైనా ఉన్నాయా అంటే అది ఉందని అంటున్నారట.

బాలయ్య లుక్ విషయంలో ఒక్కోసారి అద్బుతంగా అనిపించినా ఒక్కోసారి మాత్రం మైనస్ మార్కులే పడతాయి అంటున్నారు..ఇక బరువు కూడా మరింత తగ్గి ఉంటే కచ్చితంగా ఎవ్వరూ వంక కూడా పెట్టె విధంగా ఉండేది కాదని అంటున్నారు…మరి ఇది ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకుంటే గౌతమీపుత్ర శాతకర్ణి ఓ అద్బుతమైన సినిమా అవుతుంది అంటున్నారు వారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY