గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ రివ్యూ-రేటింగ్-కామన్ ఆడియన్స్ టాక్ & బాక్స్ ఆఫీస్ ప్రిడిక్షన్

13
1653

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ చూస్తున్న వాళ్ళందరూ చెబుతున్న మాట మగధీర-బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో మెప్పించిన ట్రైలర్ అని…బాలయ్య రౌద్రం సినిమాకే మెయిన్ హైలెట్ గా నిలవనుందని చెబుతున్నారు.

కాగా ట్రైలర్ లోనే కథలో మెయిన్ పాయింట్ చెప్పిన క్రిష్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు. కానీ ఇక్కడ అతనిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మరీ బాహుబలి రేంజ్ లో కాకున్నా మగధీర రేంజ్ గ్రాఫిక్స్ అండ్ సెట్టింగ్స్ ని కేవలం 8 నెలల గ్యాప్ లోనే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి మెప్పించడం…

ట్రైలర్ లో ప్రతీ అనువు ప్రేక్షకులను ఆకర్షించిందే అయినా ఒక్కటి మాత్రం మైనస్ గా నిలిచింది అని కామన్ ఆడియన్స్ చెబుతున్నారు. బాలయ్య గెటప్ అండ్ ఓవర్ వెయిట్ అని అంటున్నారు…కానీ శాతకర్ణిపై రీసెర్చ్ చేసిన క్రిష్ శాతకర్ణి ఎలా ఉన్నారో అలాంటి లుక్ నే బాలయ్యకి సెట్ చేశామని ఈ మధ్య చెప్పారు..కాబట్టి వాళ్ళు కూడా దాన్ని అర్ధం చేసుకున్నారు.

మొత్తంమీద ట్రైలర్ లో ఎలాంటి మైనస్ పాయింట్స్ లేవు….ట్రైలర్ కి వంక పెట్టాల్సిన అవసరం కూడా క్రిష్ కల్పించలేదు…దేశం మీసం మెలేద్దం అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మొత్తంగా కామన్ ఆడియన్స్ కి సైతం ట్రైలర్ బాగా నచ్చేసింది. దాంతో మేము ట్రైలర్ కి ఇస్తున్న రేటింగ్ 4/5.

ఇక బాక్స్ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా కచ్చితంగా నయా చరిత్ర సృష్టించడం ఖాయం. మంచి టైంలో రిలీజ్ చేస్తున్న పోటి తీవ్రంగానే ఉంది కాబట్టి మా మొదటి ప్రిడిక్షన్ సినిమాకు 55 కోట్లనుండి మొదలవుతుంది…సంక్రాంతి రిలీజ్ కి ముందు ఎంత కలెక్ట్ చేస్తుందో అప్పుడు ఫైనల్ ప్రిడిక్షన్ తెలుపుతాం,….మీరు ట్రైలర్ చూసి మీ ఫీలింగ్స్ ని అలాగే ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

13 COMMENTS

LEAVE A REPLY