ఫ్లాష్ న్యూస్:- ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ స్టోరీ లైన్ ఇదే

0
25369

ntr movie sskts tmsbntయంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ 2016 జనతాగ్యారేజ్ సినిమా షూటింగ్ ఒకపక్క శరవేగంగా జరుగుతూ ఉంటే సినిమా కథ గురించిన చర్చలు ఫిల్మ్ నగర్ లో లీక్ అవుతూనే ఉన్నాయి. సినిమా కథ ఇలా ఉంటుంది అలా ఉంటుంది నానా హాడావుడి చేస్తున్న కొందరు ఇప్పుడు ఫైనల్ గా జనతాగ్యారేజ్ సినిమా కథ ఇదే అని గట్టిగా చెబుతున్నారు.

వారు చెబుతున్న దానిప్రకారం ఎన్టీఆర్ IIT చదివే స్టూడెంట్, దాంతో పాటు చెట్లన్నా మొక్కలన్నా విపరీతమైన ప్రేమ. ఎవరైనా మొక్కలని-చెట్లను తుంచేద్దామనుకుంటే వాళ్ళ బెండు తీసే టైప్. మొక్కలనే కాదు మనుషులను కూడా ప్రేమగా చూసే మరో పెద్దాయన మోహన్ లాల్ ఎన్టీఆర్ వ్యక్తిత్వం మెచ్చి తను ప్రజల కోసం స్థాపించిన జనతాగ్యారేజ్ లో ఎన్టీఆర్ కి చోటు కల్పిస్తాడు.

ఇక ఇద్దరు కలిసి ఎక్కడ జనాలను కష్టం వచ్చింది అని తెలిసినా అక్కడ న్యాయం చేస్తుంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంట్లోనే పవర్ కోసం ఆరాటపడే మోహన్ లాల్ తనయుడు-ఎన్టీఆర్ ఫ్రెండ్ అయిన ఉన్ని ముకుందన్ ఎన్టీఆర్ ఎదుగుదల చూసి ఓర్వలేక విలన్లతో చేతులు కలుపుతాడు. ఇదంతా ఉన్ని ముకుందన్ చేస్తున్నాడని ఎన్టీఆర్ కి తెలిసిన తరువాత ఏం చేశాడు అనేది మిగిలిన స్టోరీ అట.

ఇక నిత్యామీనన్ క్యారెక్టర్ కూడా చాలా ముఖ్యమైన క్యారెక్టర్ అని కథని కీలకమలుపుతిప్పే రోల్ అని అంటున్నారు. కథ సింపుల్ గానే ఉన్న కొరటాల మార్క్ ట్రీట్ మెంట్ తో మాస్ ని మెప్పించే విధంగా అన్ని హంగులు ఇందులో ఉండబోతున్నట్లు చెబుతున్నారు. ఈ కథ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పటికైతే ఇదే ఫైనల్ కథ అంటూ గట్టిగా చెబుతున్నారు. మరి అసలు నిజం తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

LEAVE A REPLY